“సలార్ 2” లో ప్రభాస్ భారీ డైలాగ్!?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి పార్ట్ లో ప్రభాస్ కి ఎక్కువగా డైలాగ్స్ లేవు. అవి ఫ్యాన్స్ ను కాసింత నిరాశకి గురి చేశాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ను పార్ట్ 2 లో జోడించాడు.

సలార్ 2లో ప్రభాస్ భారీ డైలాగ్ ఉందని, ఇది ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది అని సమాచారం. పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ మరో రెండు నెలల్లో సలార్ 2ని సెట్స్ పైకి తీసుకు వెళుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Exit mobile version