“పుష్ప 2” రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

“పుష్ప 2” రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

Published on Jun 17, 2024 6:06 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ యాక్షన్ డ్రామా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 15, 2024 న ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా, వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ పై లేటెస్ట్ ఇన్ఫో ఏమిటంటే, డిసెంబర్ నెలలో మేకర్స్ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఆగస్ట్ నెల తర్వాత, ఎక్కువగా బెన్ ఫిట్ అయ్యే వీకెండ్ డిసెంబర్ నెలలో ఉన్నట్లు మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. ఇంకా పూర్తి కావాల్సిన షూటింగ్ పార్ట్ కూడా ఎక్కువగా ఉండటం తో డిసెంబర్ నెలలో పక్కా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే మేకర్స్ నుండి రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు