కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి కంగువ చిత్రంలో కనిపించనున్నారు. డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం తరువాత సూర్య చేయబోయే ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో సూర్య ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సూర్య 44 అనే టైటిల్ ను తాత్కాలికంగా పెట్టడం జరిగింది.
అయితే ఈ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. ఈరోజు రాత్రి 12:12 గంటలకు ఒక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. లెట్స్ మేక్ ఏ విష్ అంటూ పోస్టర్ పై రాసి ఉంది. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒక వ్యక్తి గన్ పట్టుకొని ఉన్నట్లు చూడవచ్చు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
#Suriya44 #LetsMakeAWish pic.twitter.com/cc7IPUSSCW
— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024