పుష్ప 2 రూల్ నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్!

పుష్ప 2 రూల్ నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్!

Published on Jan 1, 2024 9:51 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం లో ధనంజయ, అనసూయ భరద్వాజ్, సునీల్, ఫాహద్ ఫజిల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్ జాతర గెటప్ కి సంబందించిన హ్యాండ్ తో పోస్టర్ డిజైన్ బాగుంది. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు