నితిన్ “రాబిన్‌హుడ్‌” నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

నితిన్ “రాబిన్‌హుడ్‌” నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Jun 13, 2024 4:01 PM IST

టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్‌ (Robinhood). ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ అందించారు. రేపు ఉదయం 11:07 గంటలకి బాస్ లేడీ కి సంబందించిన అప్డేట్ రానుంది. సినిమాలో హీరోయిన్ రోల్ పై నేడు క్లారిటీ రానుంది.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు