పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ రాముడు గా, డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. కృతి సనన్ సీత పాత్రలో నటించగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడు పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇప్పుడు సలార్ టీజర్ విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, శరణ్ శక్తి తదితరులు ఈ బిగ్గీలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సలార్ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


