రామ్ చరణ్ ‘ధ్రువ – 2’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Published on Oct 5, 2022 12:34 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ మూవీ ధ్రువ. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో తమిళ్ లో తెరకెక్కి సూపర్ హిట్ అందుకున్న తని ఒరువన్ కి రీమేక్ గా రూపొందిన విషయం తెలిసిందే. ఆ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ఎన్వీ ప్రసాద్, అల్లు అరవింద్ నిర్మించారు. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ తో మోహన్ రాజా తెరకెక్కించిన సినిమా గాడ్ ఫాదర్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థల పై తెరకెక్కిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, మురళి శర్మ, సముద్రఖని వంటి వారు కీలక రోల్స్ చేసారు.

దసరా కానుకగా రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా నేడు ఈ మూవీ మీడియా మీట్ నిర్వహించింది యూనిట్. అందులో భాగంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, గాడ్ ఫాదర్ మూవీ పై యూనిట్ మొత్తానికి మంచి నమ్మకం ఉందని, ఇక దీని తరువాత త్వరలో రామ్ చరణ్ తో మోహన్ రాజా ధ్రువ 2 తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని, ప్రస్తుతం ఆయన ఆ మూవీ స్టోరీ పై కసరత్తు చేస్తున్నారని ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ని మెగా ఫ్యాన్స్ కి అందించారు. మొత్తంగా దీనితో త్వరలో రామ్ చరణ్ ధ్రువ 2 తెరకెక్కనుందని క్లారిటీ అయితే కొంతవరకు వచ్చింది. మరి ఈ క్రేజీ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :