విజయ్ దేవరకొండ – గౌతం తిన్ననూరి మూవీ లేటెస్ట్ అప్డేట్!

విజయ్ దేవరకొండ చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్‌ చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ హీరో వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో VD 12 అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ వైజాగ్ ప్రాంతం లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కీలక ఇంటర్వల్ ఎపిసోడ్ చిత్రీకరణలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది భారీ యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. ఈ చిత్రం నుండి త్వరలో స్నీక్ పీక్ ను రిలీజ్ చేయనున్నట్లు విజయ్ దేవరకొండ బర్త్ డే రోజున వెల్లడించిన సంగతి తెలిసిందే.

సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్ల లోకి రానుంది.

Exit mobile version