IPL 2025 : ఉత్కంఠ పోరులో లక్నోపై ఢిల్లీ సూపర్ విక్టరీ

IPL 2025 : ఉత్కంఠ పోరులో లక్నోపై ఢిల్లీ సూపర్ విక్టరీ

Published on Mar 24, 2025 11:21 PM IST

ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా జరిగిన లక్నో సూపర్ జియెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ పూర్తి రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జియెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో టీమ్‌లో మిచెల్ మార్ష్ (72), నికోలస్ పూరన్ (75) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ బౌలర్లపై చెలరేగారు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన డేవిడ్ మిల్లర్ (27) పరుగులు చేయడంతో ఢిల్లీ ముందు 210 పరుగుల లక్ష్యాన్ని పెట్టగలిగారు.

ఇక 210 పరుగుల రన్ ఛేజ్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. డూ ప్లెజిస్ (29) పరుగులతో లక్ష్యాన్ని చేధించే ప్రయత్నం చేసినా అతడు కూడా ఊహించని విధంగా ఔట్ అయ్యాడు. టాప్ ఆర్డ్ కూప్పకూలడంతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు తమ బ్యాట్లను ఝుళిపించారు. అక్సర్ పటేల్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (34) పరుగులతో ఛేజ్ కొనసాగించారు. అయితే, ఆ తర్వాత వచ్చిన అశుతోష్ శర్మ(66 నాటౌట్) చెలరేగి ఢిల్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా విప్రాజ్ నిగమ్(39) పరుగులతో చెలరేగిపోయాడు. అశుతోష్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ రసవత్తర పోరులో అదిరిపోయే విజయాన్ని అందుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు