IPL 2025: వాళ్లకి అనిరుద్ మనకి థమన్.. ‘ఓజి’తో మోత మోగిస్తాడా?

IPL 2025: వాళ్లకి అనిరుద్ మనకి థమన్.. ‘ఓజి’తో మోత మోగిస్తాడా?

Published on Mar 25, 2025 11:57 AM IST

ఇప్పుడు రోజు సాయంత్రం అయ్యిందంటే చాలు ఐపీఎల్ మ్యాచ్ లతోనే జనం అంతా ఎంజాయ్ చేస్తున్నారు. దీని ప్రభావం సాయంత్రం థియేటర్స్ లో సినిమాలపై కూడా పడుతుంది. అయితే ఈసారి ఐపీఎల్ కూడా మంచి రసవత్తరంగానే స్టార్ట్ కాగా క్రికెట్ తో సినిమాకి చెందిన సెలెబ్రెటీలు కూడా చాలా మంది కనిపిస్తూనే ఉన్నారు.

ఇలా రీసెంట్ గా చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ కి తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో అదిరిపోయే మ్యూజికల్ వెల్కమ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇక అందులో తన హుకుం సాంగ్ ఓ రేంజ్ లో వైరల్ గా కూడా మారింది. మరి ఇక ఇపుడు మన దగ్గర థమన్ వంతు వచ్చింది అని చెప్పాలి.

లేటెస్ట్ గా ఐపీఎల్ వారు థమన్ తో ఈ మార్చ్ 27న హైదరాబాద్ లో జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో మ్యాచ్ కి గాను తమ స్పెషల్ పెర్ఫామెన్స్ ని అనౌన్స్ చేశారు. దీనితో ఆరోజు మాత్రం థమన్ తన బీట్స్ తో మోత మోగించనున్నాడని చెప్పవచ్చు. మెయిన్ గా తమిళ ఆడియెన్స్ కి అనిరుద్ హుకుం ప్లే చేస్తే ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనకి ‘ఓజి’ ట్రాక్ కి ఆ రేంజ్ లో రావచ్చని చెప్పాలి. మరి థమన్ ఎలాంటి ట్రీట్ అండ్ ట్రాక్స్ ని ఆరోజుకి ప్లాన్ చేసుకున్నాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు