IPL 2025 : ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ

IPL 2025 : ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ గ్రాండ్ విక్టరీ

Published on Mar 29, 2025 11:42 PM IST

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (63), శుభ్‌మాన్ గిల్(38) చక్కటి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (39) స్కోర్ బోర్డు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, మిగతా ప్లేయర్స్ ఎవరూ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడం తో గుజరాత్ టైటాన్స్ 196 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇక 197 పరుగులు టార్గెట్‌తో బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించే ప్రయత్నం చేయలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(8), రయాన్ రికెల్టన్(6) పరుగులకే వెనుదిరిగారు. ఇక ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(39), సూర్య కుమార్ యాదవ్(48) కొంతమేర జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కానీ వారు ఔట్ అయ్యాక, మిగతా ప్లేయర్లు జట్టును కాపాడేందుకు ప్రయత్నించినా, గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి వారు పరుగులు చేయలేకపోయారు. ఇక 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయాన్ని అందుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు