IPL 2025 : పంజాబ్ కింగ్స్‌పై పోరాడి ఓడిన గుజరాత్ టైటన్స్

IPL 2025 : పంజాబ్ కింగ్స్‌పై పోరాడి ఓడిన గుజరాత్ టైటన్స్

Published on Mar 25, 2025 11:31 PM IST

ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం జరిగిన గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. ఇక పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 5 పరుగులకే ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (47)తో కలిసి శ్రేయాస్ అయ్యర్(97 నాటౌట్) పంజాబ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వరుస వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డును మాత్రం పరుగులు పెట్టించారు. చివర్లో వచ్చిన శశాంక్ సింగ్ (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

ఇక 244 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్ (33), సాయి సుదర్శన్ (74) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (54)తో కలిసి షర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (46) గుజరాత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఓవర్లు సాగుతున్న కొద్ది ఉత్కంఠంగా మారిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు