ఇండియన్ క్రికెట్ దగ్గర నిన్నటి నుంచే ఐపీఎల్ పండుగ మొదలైన సంగతి తెలిసిందే. అయితే మన తెలుగు ఆడియెన్స్ కి ఎమోషన్ అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు రాజస్థాన్ రాయల్స్ తో తలపడ్డ సంగతి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ లో గత ఐపీఎల్ లో లానే రికార్డు లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కొట్టి సంచలనం సెట్ చేసింది.
ఏకంగా 280 పరుగులకే పైగా నిర్ణీత 20 ఓవర్లు లోనే కొట్టి కొత్త రికార్డు సెట్ చేయగా ఈ భారీ లక్ష్యం ఛేదించేందుకు దిగిన రాజస్థాన్ రాయల్స్ గట్టిగానే పోరాడారు కానీ మొత్తానికి ఓటమిని అంగీకరించ తప్పలేదు. 6 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులు మాత్రమే చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.
దీనితో ఈ ఐపీఎల్ లో ఇదొక సాలిడ్ స్టార్ట్ తో కూడిన మ్యాచ్ అని చెప్పాలి. ఇక సన్ రైజర్స్ లో ఇషాన్ కిషన్ సెంచరీతో దంచి కొట్టగా హెడ్ హాఫ్ సెంచరీ చేసాడు. ఇక రాజస్థాన్ జట్టులో అయితే ధృవ్, సంజు సాంసన్ అలాగే హేట్మేయర్ లు అదరగొట్టగా వీరితో పాటుగా శుభమ్ దూబే కూడా సాలిడ్ నాక్ అందించాడు. ఇలా మొత్తానికి అయితే సన్ రైజర్స్, రాజస్థాన్ మ్యాచ్ మంచి ఉత్కంఠ పోరులో ముగిసింది.