ఇంట్రెస్టింగ్..”2018″ డైరెక్టర్ విత్ చిరు..?


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “భోళా శంకర్” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు మెహర్ రమేష్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ అప్డేట్ కూడా వచ్చింది. అయితే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది అని ఏది కూడా ఇంకా అధికారికంగా అయితే అనౌన్స్ కాలేదు. మరి మెగాస్టార్ లైనప్ పై అయితే ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

రీసెంట్ గా మళయాళ సినిమా దగ్గర అయితే సంచనలన విజయం నమోదు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం “2018” దర్శకుడు జూడే ఆంథోనీ అయితే మెగాస్టార్ తో సినిమా చేయనున్నారు అని ఓ రూమర్ ఇపుడు వైరల్ అవుతుంది. అలాగే మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే చిరు గత భారీ హిట్ “వాల్తేరు వీరయ్య” లో కనిపించిన విశాఖ పట్నం నేపథ్యంలో అయితే వీరి సినిమా ఉంటుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ ఊహించని కాంబినేషన్ ఎంతవరకు నిజం అనేది చూడాల్సిందే.

Exit mobile version