చరణ్ కి స్పెషల్ టైటిల్ కార్డ్?

ఇంకొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్” థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. మరి మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా చరణ్ నుంచి “వినయ విధేయ రామ” తర్వాత వస్తున్న సోలో సినిమా అది కూడా దర్శకుడు శంకర్ తో సినిమా కావడంతో మంచి అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మన సౌత్ స్టార్స్ విషయంలో టైటిల్ కార్డ్స్ మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక శంకర్ క్రియేటివిటీ ఎలా ఉంటుందో కూడా ఎన్నో సినిమాల్లో చూసాం. రీసెంట్ గా భారతీయుడు 2 కి కమల్ హాసన్ కోసం చేయించిన టైటిల్ కార్డుకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇపుడు చరణ్ కోసం కూడా శంకర్ తన మార్క్ క్రియేటివ్ మైండ్ తో ఏమన్నా చేసారా అనేది చూడాలి. రీసెంట్ గా పుష్ప 2 కి బన్నీ ఫ్యాన్స్ కొంచెం డిజప్పాయింట్ అయ్యారు. మరి గేమ్ ఛేంజర్ కి ఇలాంటి స్పెషల్ ట్రీట్ ఉందో లేదో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Exit mobile version