పెళ్లికి రెడీ అవుతోన్న యంగ్ హీరోయిన్ !

పెళ్లికి రెడీ అవుతోన్న యంగ్ హీరోయిన్ !

Published on Mar 23, 2021 2:07 AM IST

కన్నడ హీరోయిన్ ‘సంజన గల్రాని’ ప్రస్తుతం పెళ్లి చేసుకునే మూడ్ లో ఉందట. లక్ డౌన్ లోనే ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంజనా, తాజాగా అతనితో ఏడు అడుగులు నడవడానికి రెడీ అవుతొందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ పెళ్లి విషయం బయటికి రాకుండా సంజన చాల సీక్రెట్ ను మెయింటైన్ చేస్తోందని తెలుస్తోంది.

ఇక డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లి వచ్చాక, ఆమె ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయని.. పెళ్లి తర్వాత ఇక సినిమా రంగానికి కూడా పూర్తిగా దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుందట. ఇంతకీ సంజన పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు డాక్టర్ పాషా. అతనితోనే ఆమె పెళ్లి. ఈ వేసవి సెలవుల్లో వీరి వివాహ వేడుక ఉంటుందని సమాచారం. పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులను మిత్రులను మాత్రమే ఆహ్వానించాలని ఈ జంట నిర్ణయించుకున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు