“పుష్ప” కోసం మళ్లీ ట్రెండ్ సెట్టింగ్ లుక్ సిద్ధం చేస్తున్న బన్నీ..?

“పుష్ప” కోసం మళ్లీ ట్రెండ్ సెట్టింగ్ లుక్ సిద్ధం చేస్తున్న బన్నీ..?

Published on Jul 4, 2020 12:57 AM IST


మన టాలీవుడ్ లో అల్ట్రా స్టైలిష్ లుక్స్ మరియు ట్రెండ్ సెట్టింగ్ హెయిర్ స్టయిల్స్ కు కేరాఫ్ అడ్రస్ అల్లు అర్జున్. తన ప్రతీ సినిమాకు కొత్త కొత్త లుక్స్ తో తనను తాను ఆవిష్కరించుకోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు బన్నీ. అయితే తన ప్రతీ సినిమాకి ఒక సరికొత్త లుక్ లోకి బన్నీ మారుతాడన్న సంగతి తెలిసిందే. తాను ఏ దర్శకునితో సినిమా చేసినప్పటికీ తన మేకోవర్ మాత్రం కొత్తగా ఉంటుంది.

అలా ఇప్పుడు తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో తీస్తున్న పుష్ప సినిమాకు సిద్ధం చేసిన లుక్ ను కూడా మనం చూసాం. అయితే బన్నీ వైపు ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులు అంతా చూసిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు పూరి జగన్నాథ్ తో తీసిన “దేశ ముదురు” సినిమా విషయంలో అని చెప్పాలి. అప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరో కూడా చెయ్యని విధంగా సిక్స్ ప్యాక్ ఆబ్స్ లో కనిపించి ట్రెండ్ సెట్ చేసాడు. అక్కడ నుంచి టాలీవుడ్ లో అదే పరపంపర కొన్నాళ్ల పాటు కొనసాగింది.

ఆ తర్వాత బన్నీ మళ్లీ బద్రీనాథ్ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్స్ లో కనిపించారు. అయితే ఇప్పుడు సుకుమార్ తో తీస్తున్న పుష్ప చిత్రాన్ని భారీ పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కించనున్నారు. మరి పాన్ ఇండియన్ సినిమా అంటే మినిమం అన్ని హంగులు ఉండాల్సిందే. అలా.. ఈ చిత్రంలో బన్నీ మరో సారి సిక్స్ ప్యాక్ లుక్ ని ప్రిపేర్ చేస్తున్నారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో కానీ బన్నీ కు ఎలాగో నార్త్ ఆడియన్స్ మంచి గుర్తింపు ఉంది దానికి తోడు బన్నీ ఆ లుక్ లో కనిపించి కూడా చాన్నాళ్లు అయ్యిపోయింది సో మరోసారి కానీ బన్నీ తాను సెట్ చేసిన ట్రెండీ లుక్ లొనే మళ్లీ కనిపిస్తే ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకొచ్చే అంశం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు