పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ తోనే అదిరే రెస్పాన్స్ ని అందుకోవడం మొదట్లో ఈ సినిమాపై వచ్చిన నెగిటివిటీని అయితే పక్కన పడేసింది. ఇక మరి ఈ చిత్రంలో అల్రెడీ యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఇప్పుడు ఈ హీరోయిన్ తో పాటుగా మరో యంగ్ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో కనిపించనుంది అంటూ లేటెస్ట్ టాక్ తెలుస్తుంది. మరి ఆ హీరోయిన్ రీసెంట్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యిన సాక్షి వైద్య అన్నట్టు తెలుస్తుంది. దీనితో అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


