Devara: “దేవర” అక్కడ 100 కోట్ల క్లబ్ లో ఛాన్స్ ఉందా?


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి మరో యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రమే “దేవర”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చి సెన్సేషనల్ వసూళ్లు ఈ చిత్రం అందుకుంది. ఇలా తెలుగు సహా హిందీ భాషల్లో మేజర్ గా దేవర భారీ వసూళ్లు అందుకుంటూ వస్తుండగా ఈ వసూళ్ళలో హిందీ మార్కెట్ వసూళ్లు సినిమా వచ్చి రెండు వారాలు దాటినా డీసెంట్ హోల్డ్ తో కొనసాగుతుంది.

మరి అక్కడ ఆల్రెడీ 60 కోట్ల నెట్ వసూళ్లు దాటిన ఈ చిత్రం నెక్స్ట్ స్టాప్ గా 100 కోట్ల మార్క్ ని దాటుతుందా లేదా అనేది చూడాలి. ఆల్రెడి సినిమా మూడో వీకెండ్ లోకి చేరుకుంది కాబట్టి మళ్ళీ వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఇదేమన్నా వర్కవుట్ అయ్యి లాంగ్ రన్ లో ఓన్లీ హిందీ వెర్షన్ లో దేవర 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుందో లేదో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version