“డాకు మహారాజ్” రన్ టైం లాక్ అయ్యిందా?

“డాకు మహారాజ్” రన్ టైం లాక్ అయ్యిందా?

Published on Dec 17, 2024 3:00 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి ఇపుడు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కి దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకి సాలిడ్ రన్ టైం లాక్ చేసినట్టుగా బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం డాకు మహారాజ్ 2 గంటల 45 నిమిషాల మేర కట్ తో థియేటర్స్ లో ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అల్రెడీ సినిమాని బాబీ నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించారు అంటూ టాక్ ఉంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు