ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడితో అయితే ఓ సాలిడ్ మాస్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి బాలయ్య “అఖండ” నుంచి తన ట్రాక్ మార్చి మళ్ళీ వింటేజ్ బాలయ్యగా ఇంట్రెస్టింగ్ జానర్స్ ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. మరి ఇదే క్రమంలో మరింత మంది యంగ్ దర్శకులతో బాలయ్య వర్క్ చేయనుండగా లేటెస్ట్ గా అయితే క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది.
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను స్టార్ట్ చేసిన ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ “హిట్” సినిమా యూనివర్స్ లో అయితే బాలయ్య కూడా కనిపించనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. బహుశా తనపై సినిమా అయితే ఈ ఫ్రాంచైజ్ లో నాలుగో సినిమా ఉంటుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ క్రేజీ యూనివర్స్ లో బాలయ్య లాంటి హీరో ఉంటే ఆ ఊహే ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ లెవెల్ మాస్ లో ఉందని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.