‘దేవర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి డేట్, ప్లేస్ ఫిక్స్..?

టాలీవుడ్‌లో తెరకెక్కిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, తెలుగులో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఓపెన్ ప్లేస్‌లో చేయాలని మేకర్స్ భావించారట. కానీ, దానికి పోలీసుల అనుమతి దొరక్కపోవచ్చని భావించిన మేకర్స్, ఇప్పుడు ఈ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని నోవోటెల్‌లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 22న ఆదివారం రోజున ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉందట. అయితే, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా ఎవరు వస్తారా అనేది కూడా తెలియాలి. మరి ‘దేవర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎవరెవరు వస్తారో చూడాలి.

Exit mobile version