“దేవర” ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారయ్యిందా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం ఇపుడు అభిమానులు ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ఒకో సాంగ్ వచ్చి మంచి రెస్పాన్స్ ని కూడా అందుకోగా ఇప్పుడు ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ పట్ల మరింత ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ ట్రైలర్ కి ఇప్పుడు డేట్ ఖరారు అయ్యినట్టుగా బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం దేవర ట్రైలర్ ఈ సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాగో రిలీజ్ దగ్గరకి వస్తుంది కాబట్టి రెండు వారాల ముందు సమయం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పాలి. ఇక ఈ డేట్ పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రంకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version