నార్త్ లో స్టడీగా “ఈగల్”.?

నార్త్ లో స్టడీగా “ఈగల్”.?

Published on Feb 15, 2024 3:07 PM IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ హీరోయిన్ గా యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఫీస్ట్ చిత్రం “ఈగల్”. మరి గత వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి వసూళ్లను ఫస్ట్ వీకెండ్ కి అందుకుంది. ఇక ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా హిందిలో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హిందీలో మేకర్స్ ఈ చిత్రాన్ని “సహదేవ్” గా రిలీజ్ చేయగా ఈ చిత్రానికి అక్కడ కూడా చాలా యావరేజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది.

కానీ నార్త్ లో మాత్రం సహదేవ్ కి వచ్చిన రెస్పాన్స్ అలా స్టడీగా కొనసాగుతున్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. డే 1 కంటే బెటర్ గానే ఇప్పుడు వసూళ్లు స్టడీగా వెళుతున్నాయని గతంలో కూడా ఖిలాడీ సినిమాకి హిందీలో తక్కువ అయినప్పటికీ కొంచెం స్థిరమైన వసూళ్లు రాగ ఇపుడు ఈగల్ కి కూడా డీసెంట్ రన్ కొనసాగుతుందట.. అలాగే ఈ చిత్రం కూడా నార్త్ లో 1 కోటి గ్రాస్ కి చేరుతుంది అని టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు