సల్మాన్ ‘సికందర్’కి ఈద్ హాలిడే కలిసొచ్చిందా? వసూళ్లు ఎంత

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన్నా అలాగే కాజల్ అగర్వాల్ లు హీరోయిన్స్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ చిత్రం “సికందర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఈద్ కానుకగా సల్మాన్ నుంచి రిలీజ్ కి రాగా ఊహించని నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో సైతం సరైన ఆదరణ మొదటి రోజే అక్కడ కనిపించలేదు.

ఇలా ఇండియా వైడ్ 30 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం నిన్న సోమవారం ఈద్ హాలిడే వసూళ్లు కూడా కీలకంగా మారాయి. అయితే డే 1 వసూళ్లు ఎలాగో బాగానే వస్తాయి కానీ డే 2 కి మరీ అంత ఎక్కువ జంప్ సినిమాకి దక్కలేదు. డే 2 కి 33.36 కోట్లు మాత్రమే వసూలు అయినట్టుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ఈద్ హాలిడే కొంతవరకు భాయ్ కి ఉపయోగపడింది అని చెప్పవచ్చు. ఇక అసలు టెస్ట్ ఈ వర్కింగ్ డే నుంచి ఉండనుంది. ఈ వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి మరి.

Exit mobile version