బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా మరికొన్ని రోజులు ఆలస్యంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే, పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ బోర్డు వద్ద ఈ సినిమాకి చుక్కెదురైంది. చాలా సన్నివేశాల విషయంలో బోర్డు అభ్యంతరం తెలిపిందని టాక్.
కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని తీసుకువస్తున్నారు. ఇందిర పాత్రలో కంగనా కనిపించబోతుంది. అలాగే, మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అన్నట్టు బీజీపీ పార్టీ నుంచి కంగనా భాజపా ఎంపీగా గెలిచింది. ఈ క్రమంలో ఆమె ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా సినిమా చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ సినిమాలో ఇందిరా గాంధీని అవమానించే విధంగా సన్నివేశాలు ఉంటే తగిన బుద్ధి చెబుతాం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్ట్ లు పెడుతున్నారు.