ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన ఈ సినిమా ఆల్రెడీ థియేటర్స్ లో 3 గంటల 20 నిమిషాలు నిడివితో వచ్చి మరీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.
దీనితో ఈ క్రిస్మస్ కానుకగా మరో 18 నిమిషాల మేర నిడివి అదనంగా జోడించి మేకర్స్ సినిమాని థియేటర్స్ లో అప్డేట్ చేస్తారని తెలుస్తోంది. అది కూడా 3డి వెర్షన్ లో అన్నట్టు టాక్. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.