మన టాలీవుడ్ లో పలు చిత్రాలు అవి వచ్చిన సమయంకి కొంచెం అడ్వాన్స్డ్ గా అనిపించి అప్పట్లో మరీ ఎక్కువ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోలేనివి చాలానే ఉన్నాయని చెప్పాలి. మరి అలాంటి వాటిలో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలు కూడా ఎక్కువే ఉంటాయి.
అలా తాను అలాగే మరో స్టార్ హీరో వెంకీ మామ కలయికలో వచ్చిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” కూడా అది రిలీజ్ అయ్యి ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా తాలూకా విలువ చాలా మందికి తెలిసొచ్చింది. మరి ప్రస్తుతం పలు సినిమాలు థియేటర్స్ లో రీరిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ క్లాసిక్ చిత్రం కూడా రీరిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇంకా డేట్ ఎప్పుడు అనేది ఖరారు కాలేదు కానీ ప్రస్తుతం ఈ టాక్ మహేష్ అండ్ వెంకటేష్ అభిమానులకి గుడ్ న్యూస్ గా మారింది. మరి నిజంగా ఈ సినిమా రీరిలీజ్ కి వస్తే డెఫినెట్ గా మంచి ఆదరణ దక్కుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అలాగే మణిశర్మ నేపథ్యగీతం అందించారు. దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.