గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఎమోషనల్ అండ్ మెసేజ్ సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ కాలేదు. ఇక నెక్స్ట్ చరణ్ నుంచి వచ్చే సినిమాలు పైనే మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
అయితే ఈ లైనప్ లో దర్శకుడు బుచ్చిబాబు సానా అలాగే తన గురువు సుకుమార్ లతో కూడా భారీ సినిమాలు ఉన్నాయి కానీ వీటితో పాటుగా మళ్లీ గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు తోనే ఓ భారీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ రెమ్యూనరేషన్ లేకుండా చేస్తాడని రూమర్స్ వచ్చాయి.
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఇపుడు తెలుస్తోంది. ప్రస్తుతానికి చరణ్ ఆ రెండు సినిమాలు తప్ప ఇంకే సినిమా కూడా ఓకే చేయలేదట. సో దిల్ రాజుతో సినిమా వార్తలు అవాస్తవం అని చెప్పాలి.