గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఉండగా ఉండగా ఆలస్యం అవుతూ వచ్చేసింది. దీనితో ఫ్యాన్స్ లో ఆ మధ్య అంతా బాగా నీరసం వచ్చేసింది.
అనౌన్స్ చేయడానికి పాన్ ఇండియా లెవెల్లో చేశారు కానీ ప్రాపర్ ప్లానింగ్స్ లేవని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ఓ పాన్ ఇండియా సినిమా అంటే ఈ పాటికే భారీ లెవెల్లో ప్రమోషన్స్ అన్ని వైపులా జరుగుతూ ఉండాలి కానీ ఇంట్రెస్టింగ్ గా గేమ్ ఛేంజర్ కి ఇవేమి కనిపించకపోగా ఇంకా సినిమా రిలీజ్ రెండు వారాల గడువు మాత్రమే ఉన్నప్పటికీ ఇంకా ట్రైలర్ వదలకపోవడం మరో డిజప్పాయింటింగ్ అంశం అని చెప్పాలి.
దీనితో వచ్చిన హైప్ ని మేకర్సే నెమ్మదిగా పోగొట్టుకుంటున్నారని చెప్పక తప్పదు. ప్రస్తుతానికి అయితే ట్రైలర్ ఈ 30న వస్తుంది అని టాక్ వినిపిస్తుంది. మరి ట్రైలర్ మాత్రం పెద్ద మ్యాజిక్ చెయ్యకపోతే సినిమాకి చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పక తప్పదు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే రానున్న జనవరి 10న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.