మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్ని ముద్ర ఉంది. అలాగే తమ కెరీర్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా బిగ్ స్క్రీన్స్ పై ఫలితానికి సంబంధం లేకుండా టోటల్ టాలీవుడ్ సినిమా దగ్గర చెరగని ముద్ర వేసాయి. ఇక అలా తమ కాంబినేషన్ నుంచి వచ్చిన అవైటెడ్ మూడో సినిమానే “గుంటూరు కారం”.
మరి మహేష్ లోని డైనమిక్ షేడ్ ని త్రివిక్రమ్ సాలిడ్ గా ప్రెజెంట్ చేయగా వాటిని మించిన ఎమోషన్స్ ని డైలాగ్స్ ని కూడా మహేష్ తో చూపించారు. టోటల్ రిజల్ట్ ని పక్కన పెడితే ఈ విషయాల్లో మాత్రం వీరి కాంబినేషన్ చాలా మందిని మెప్పించింది. మరి గతంలో లానే ఈ సినిమాకి కూడా థియేటర్స్ లో మిక్స్డ్ నెగిటివ్ స్పందనే వచ్చింది.
కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమో ఓటిటి(స్మాల్ స్క్రీన్ వెర్షన్) లో గత సినిమాల్లానే మళ్ళీ యునానిమస్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ తప్పకుండా లేకపోలేదు. మహేష్ చరిష్మాని తన ఎమోషనల్ పెర్ఫామెన్స్ ని ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతగానో చేస్తారు. వీటితో అయితే ఓటిటిలో కూడా రమణ గాడి ర్యాంపేజ్ డెఫినెట్ గా ఊహించని లెవెల్లో ఉండవచ్చు. మరి చూడాలి రేపు వచ్చే సినిమాకి నెట్ ఫ్లిక్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది.