దర్శకుడు హరీష్ శంకర్ రీసెంట్గా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో హరీష్ శంకర్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం నెక్స్ట్ మూవీపైకి షిఫ్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను ఇప్పటికే ప్రారంభించాడు హరీష్ శంకర్. కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది ఈ సినిమా. అయితే, తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఫెయిల్యూర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పక్కా ప్లానింగ్‌తో రావాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్. దీంతో ఈ సినిమా స్క్రిప్టులో పలు మార్పులు చేస్తున్నాడని.. తన రైటర్స్ టీమ్‌తో ఇదే విషయంపై చర్చలు కూడా జరుపుతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి నిజంగానే ఉస్తాద్ కోసం హరీష్ శంకర్ మార్పులు చేస్తున్నాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.