‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ కి గెస్ట్‌ అతనే ?

నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న అనంతపురంలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు బాలయ్య అల్లుడు, మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు టాక్. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కోసం ఏర్పాట్లు భారీ ఎత్తున చేపడుతున్నారు. ఇక “డాకు మహారాజ్” సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్నట్టు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా హైలైట్ గా ఉంటాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్ లోని బాలయ్య – ప్రగ్యా జైస్వాల్, చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయని తెలుస్తోంది. ఎలాగూ బాలయ్య సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది.

Exit mobile version