హీరోయిన్ పెళ్లి వార్తల్లో వాస్తవం లేదట !

హీరోయిన్ పెళ్లి వార్తల్లో వాస్తవం లేదట !

Published on Jul 25, 2021 9:29 PM IST

సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా చాల రకాలుగా వస్తున్నాయి. అయితే, త్రిష.. ఓ తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని వస్తోన్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు అయితే లేవు.

అందుకే, కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకునేందుకు త్రిష రెడీ అయింది. ఈ క్రమంలోనే వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌ తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత త్రిష మళ్ళీ పెళ్లి గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ చాల నెలలు తరువాత త్రిష పెళ్లి అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు