Janhvi Kapoor: ‘దేవర’లో జాన్వీ ఎంట్రీ అప్పుడేనా..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘దేవర’ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే చూసేందుకు అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఆతృతగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడా అని అభిమానులతో పాటు సినీ సర్కిల్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం.. తమ అభిమాన నటి శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీ కపూర్ పాత్రపై తెలుగు ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, దేవర సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

దేవర సినిమాలో జాన్వీ కపూర్ తంగం అనే పాత్రలో నటిస్తుంది. అయితే, ఈ పాత్ర దేవర సినిమాలో ఇంటర్వెల్ తరువాతే కనిపిస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దాదాపు మూడు గంటల రన్‌టైమ్‌తో రాబోతున్న ‘దేవర’ సినిమాలో ఇలా హీరోయిన్ ఎంట్రీ ఇంటర్వెల్ తరువాత ఉండటం ఏమిటా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి కొరటాల శివ అండ్ టీమ్ ‘దేవర’ మూవీతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే టాక్ నెట్టింట వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ‘దేవర’ బిగ్‌స్క్రీన్‌పైకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version