ఎన్టీఆర్ క్రేజ్.. అవుట్ డోర్ ఈవెంట్ లేదా?

ఎన్టీఆర్ క్రేజ్.. అవుట్ డోర్ ఈవెంట్ లేదా?

Published on Sep 15, 2024 11:31 PM IST

మన తెలుగు సినిమా దగ్గర మంచి క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి తారక్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా తన సినిమాల ఓపెనింగ్ డే వసూళ్లే తన క్రేజ్ ఏంటి అనేది చూపిస్తాయి. ఇక తన నుంచి దాదాపు ఐదేళ్ల తర్వాత వస్తున్న సోలో రిలీజ్ పై హైప్ ఎలా ఉంటుంది? మరి ఆ రేంజ్ లోనే తన “దేవర” సినిమా భారీ లెవెల్ అంచనాలు నడుమ రాబోతుంది.

అయితే ఈ సినిమాకి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగులో మేకర్స్ అనుకున్నారు కానీ ఈ ఈవెంట్ అవుట్ డోర్ లో జరిగే సూచనలు ఇప్పుడు కనిపించడం లేదు. బయట అయితే అభిమానుల ధాటి ఎక్కువగా ఉంటుంది అని దీనితో సమస్యలు లేవనెత్తే అవకాశం ఉండడంతో హైదరాబాద్ నోవటల్ లో చేయాలని ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి అయితే తారక్ క్రేజ్ ఈ లెవెల్లో పని చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు