మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్పై యాక్షన్ చిత్రాల సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ సినిమాలో ఇపుడు తారక్ కూడా కనిపించనుండడంతో నార్త్ నుంచి సౌత్ వరకు భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో తారక్, హృతిక్ నడుమ సాలిడ్ సీక్వెన్స్ లు పాటలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఇపుడు మేకర్స్ సినిమాని ఫినిషింగ్ స్టేజికి తీసుకురాగా ఇపుడు మేకర్స్ ఓ సాలిడ్ డాన్స్ నెంబర్ కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సాంగ్ ని కూడా చుట్టమల్లే సాంగ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ తో చేయనున్నారట. మరి తారక్ కూడా ఈ సినిమా కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ తో సినిమా సెట్స్ లో అడుగు పెట్టాల్సి ఉంది. సో వార్ 2 ని ఈ సాంగ్ తోనే ఎండ్ చేస్తాడని చెప్పవచ్చు. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది.