పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పవన్ అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా “ఓజి” అని చెప్పాలి. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా జస్ట్ పోస్టర్స్ తోనే మేకర్స్ ఎనలేని హైప్ ని బిల్డప్ చేస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలో పవన్ యంగ్ రోల్ కోసం తన వారసుడు జూనియర్ పవర్ స్టార్ అకీరానందన్ చేస్తున్నాడని పలు క్రేజీ కామెంట్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ మాటతో పవన్ అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యారు కానీ ఇందులో ఎలాంటి నిజం లేదట.
అకీరా ఈ సినిమాలోనే కాదు ఏ సినిమాలో కూడా ప్రస్తుతం నటించడం లేదని తెలుస్తుంది. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ భారీ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.