బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఆమె తల్లి కాబోతున్నారనేదే ఈ వార్త సారాంశం. ఐతే, తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలపై ఆమె భర్త, హీరో విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. ‘ఆ శుభ ఘడియలు ఎప్పుడు వచ్చినా అందరికీ చెబుతాను. మేము దానిని ప్రకటించడానికి సిగ్గుపడము’ అని చెప్పుకొచ్చారు.
విక్కీ కౌశల్ మాటలను బట్టి, కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని అర్ధం అయ్యింది. ‘బ్యాడ్ న్యూజ్’ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా విక్కీ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ.. పై కామెంట్స్ చేశారు. కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కత్రీనా కైఫ్ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.