వరుణ్ తేజ్ నెక్స్ట్ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యిందా..?

మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘మట్కా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేయగా పీరియాడిక్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. అయితే, ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ నమ్మకం పెట్టుకున్నా, ఫలితం మాత్రం దక్కలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీంతో ఇప్పుడు వరుణ్ తేజ్ తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. మేర్లపాక గాంధీ ఈసారి పక్క ప్లానింగ్‌తో సాలిడ్ కథను రెడీ చేశాడని.. దీనికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కథ కొరియా నేపథ్యంలో సాగుతుందని.. అందుకే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ యాప్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలోనూ వరుణ్ తేజ్ లుక్స్ కొత్తగా ఉండబోతున్నాయని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version