“హను మాన్”.. ప్రశాంత్ వర్మ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!?

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా ఏ రేంజ్ లో షైన్ అవుతుందో చూస్తున్నాం. మరి ఈ ఏడాది జనవరిలో వచ్చిన చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. మరి ఆ సినిమానే మన తెలుగు సూపర్ హీరో చిత్రం “హను మాన్” (Hanu Man Movie). యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా సాధించిన అఖండ విజయం ఇప్పుడు 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఒక్క థియేటర్ లోనే 100 రోజులు ఓ సినిమా ఆడటం అనేది గగనం అయిపోయిన తరుణంలో 25 సెంటర్స్ లో హను మాన్ రన్ అయ్యి సెన్సేషన్ సెట్ చేసుకుంది. అయితే ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ట్రిపుల్ ఏ సినిమాస్ లో స్పెషల్ షో తర్వాత ప్రెస్ మీట్ ని పెడుతున్నట్టుగా తెలిపాడు.

అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. మెయిన్ గా “హను మాన్” తర్వాత వస్తున్నా “జై హనుమాన్” (Jai Hanuman Movie) పై రెట్టింపు ఆసక్తి ఉంది. మొన్న రామనవమి కానుకగా వచ్చిన అప్డేట్ తో మరింత హైప్ ని జెనరేట్ చేయగా ఇప్పుడు హనుమాన్ జయంతి కూడా కావడంతో నేడు ఆసక్తికర అప్డేట్స్ ని ఇచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. మరి వేచి చూడాలి ప్రశాంత్ వర్మ ఎలాంటి డీటెయిల్స్ ఇస్తాడు అనేది.

Exit mobile version