ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. మరి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ చిత్రాన్ని మేకర్స్ స్పోర్ట్స్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఆల్రెడీ పాన్ ఇండియా ఫేమ్ స్టార్స్ చాలా మందే ఉన్న సంగతి తెలిసిందే.
కానీ ఇపుడు ఏకంగా మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ సినిమాలో ఉన్నారు అంటూ పలు రూమర్స్ వైరల్ గా మారాయి. అయితే ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. సినిమా ఎంత క్రికెట్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ధోని కూడా ఉన్నారు అనే మాట ప్రస్తుతానికి గాలి మాటే అని టాక్. మరి ఈ టాక్ ఎందుకు వచ్చిందో దానిని క్రియేట్ చేసిన వారికే తెలియాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.