“విశ్వంభర” కోసం నాగశ్విన్ ఎంతవరకు నిజం?

“విశ్వంభర” కోసం నాగశ్విన్ ఎంతవరకు నిజం?

Published on Jan 30, 2025 8:59 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న భారీ చిత్రమే “విశ్వంభర”. మరి యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ విజువల్ ట్రీట్ కోసం మెగా అభిమానులు ఎపుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి విజువల్స్ చాలా కీలకమని తెలిసిందే.

విఎఫ్ఎక్స్ పరంగా చాలా పని ఉంది. అయితే టీజర్ వచ్చాక సినిమాని ఇంకా ఇంప్రూవ్ చెయ్యాలని కామెంట్స్ కూడా వచ్చాయి. దీనితో మేకర్స్ కి మళ్లీ పని పడింది. అయితే లేటెస్ట్ గా విశ్వంభర విఎఫ్ఎక్స్ పనుల్లో కల్కి 2898 ఎడి దర్శకుడు నాగశ్విన్ భాగం అయ్యాడు అంటూ ఓ టాక్ ఇపుడు స్ప్రెడ్ అవుతుంది.

తను తన సినిమాకి వర్క్ చేసిన టీమ్ విశ్వంభర విజువల్స్ ఎఫెక్ట్స్ కోసం శ్రమిస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఇపుడు నాగశ్విన్ కల్కి 2 పనుల్లోనే బిజీగా ఉన్నాడట. అలాగే విశ్వంభర మేకర్స్ మరో టీంతో గ్రాఫిక్స్ పనులు చేయిస్తున్నారని తెలుస్తోంది. సో ఆ రూమర్స్ లో నిజం లేదని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా ఈ మేలో రిలీజ్ కి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు