“అఖండ” రోజుకే “బాలయ్య 109”?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. బాలయ్య నటించిన గత మూడు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. దీనితో ఈ సినిమా మరో హ్యాట్రిక్ కి నాంది కావాలి అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఈ సినిమా రిలీజ్ కోసం ఇప్పుడు మంచి సస్పెన్స్ గా మారింది.

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో చిత్రం నిలుస్తుంది అని గత కొన్ని రోజులు నుంచి ఒక బజ్ అయితే కొనసాగుతుంది. కానీ సెంటిమెంట్ డేట్ డిసెంబర్ 2న కూడా మేకర్స్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే డిసెంబర్ 2న బాలయ్య నటించిన భారీ హిట్ “అఖండ” కూడా వచ్చింది సో ఆ డేట్ ని కూడా మేకర్స్ ఇప్పుడు హోల్డ్ లో ఉంచినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అదే డేట్ లో వస్తుందో లేదో అనేది.

Exit mobile version