మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రాబిన్ హుడ్” కోసం అందరికీ తెలిసిందే. మరి నితిన్ నుంచి చాలా కాలం గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఆల్రెడీ ఉంది. రీసెంట్ గానే ఇష్క్ రీ రిలీజ్ తో మరింత లెవెల్లో రాబిన్ హుడ్ సినిమాకి ప్లస్ చేసుకున్న యూత్ స్టార్ ఇపుడు వెనక్కి వెళుతున్నట్టు బజ్ మొదలైంది.
రాబిన్ హుడ్ ఈ డిసెంబర్ లో 20కి రాకపోవచ్చని లేటెస్ట్ టాక్. అందుకే ఇపుడు రావాల్సిన సాంగ్ కూడా వాయిదా వేశారని వినిపిస్తుంది. మరి ఈ కొత్త రూమర్స్ పై మాత్రం నితిన్ ఫ్యాన్స్ లాస్ట్ మినిట్ లో టెన్షన్ పడుతున్నారు. మరి మైత్రి మూవీ మేకర్జ్ దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.