నితిన్ సినిమా ఇక తప్పుకున్నట్టే అనుకోవాలా.?

నితిన్ సినిమా ఇక తప్పుకున్నట్టే అనుకోవాలా.?

Published on Dec 30, 2020 4:00 PM IST

ఈ ఏడాది విడుదల కాబడ్డ చిత్రాలే కొన్ని మరి ఆ కొన్నింటిలో కూడా మంచ్చి హిట్ గా నిలిచిన వాటిలో టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన “భీష్మ” కూడా ఒకటి. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నితిన్ కు మంచి కం బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా హిట్ తో తన నెక్స్ట్ “రంగ్ దే” కూడా మంచి విజయాన్ని అందుకోవాలని దానికి కూడా ఫుల్ స్వింగ్ లో పాల్గొన్నారు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు. ఇక అలాగే లాక్ డౌన్ సమయంలో కూడా ఈ సినిమా షూటింగ్ నే మొదటగా స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలబెడుతున్నామని అధికారిక ప్రకటన ఇచ్చారు.

కానీ ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చిన సమయానికి డైలమాలో ఉన్న పలు ప్రాజెక్ట్ లే విడుదల తేదీలను ప్రకటించేసి విడుదలకు ఎప్పుడు చేద్దామా అని రెడీగా ఉన్నారు. కానీ వీరి చిత్ర యూనిట్ నుంచి ఆ ఊసే ఇప్పుడు వినబడకపోవడం గమనార్హం. మిగతా సినిమాలు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశాయి.

కానీ వీరి నుంచి ఆ వైబ్రేషన్స్ లేవు. మరి ఈ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్టే అనుకోవాలా అన్న డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు