“గేమ్ ఛేంజర్” పై ఆ వార్తల్లో నిజం లేదా

“గేమ్ ఛేంజర్” పై ఆ వార్తల్లో నిజం లేదా

Published on Aug 24, 2024 8:06 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకి రామ్ చరణ్ పోర్షన్ మొత్తాన్ని పూర్తి చేసేసి ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా శంకర్ కూడా రామ్ చరణ్ పోర్షన్ లు అయ్యిపోయాయి మిగతా నటీనటులపై మాత్రమే కొన్ని రోజులు తీస్తే సినిమా అయిపోతుంది అని కన్ఫర్మ్ చేశారు.

అయితే రీసెంట్ గా కొన్ని ఊహించని రూమర్స్ ఈ సినిమాపై వైరల్ గా మారాయి. ఇంకా రామ్ చరణ్ తో కొన్ని సీన్స్ రీ షూట్ చేయాల్సి ఉందని మరో వారం చరణ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది అంటూ పలు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. చరణ్ పై చేయాల్సిన సీన్స్ అన్నీ చేసేశారని ఇక మళ్ళీ ఎలాంటి సీన్స్ చేయాల్సిన పని లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బాగా ఆలస్యం అవుతూ వస్తుంది. మళ్ళీ ఇలాంటివి అంటే అభిమానుల్లో ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు