ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ నుంచి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “వార్ 2” కూడా ఒకటి.
మరి దీనిపై హైప్ వేరే లెవెల్లో ఉండగా ఈ సినిమా కోసం ఇపుడు ఇండియా వైడ్ గానే కాకుండా ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా గట్టిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని మేకర్స్ ఎప్పుడో ఈ 2025 ఏడాది ఆగష్టు 14కి ఫిక్స్ చేసేసిన సంగతి తెలిసిందే.
కానీ ఇపుడు సినిమా వాయిదా పడినట్టుగా పలు రూమర్స్ వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతానికి ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. సినిమా ఆగస్ట్ లోనే వస్తుంది అని లేటెస్ట్ టాక్. మరి దీనిపై మేకర్స్ నుంచి కూడా అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.