ఓటిటి రిలీజ్ కి సిద్ధమైన “డెడ్ పూల్ అండ్ వుల్వరీన్”?

రీసెంట్ గా హాలీవుడ్ సినిమా దగ్గర దుమ్ము లేపిన చిత్రం ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం హాలీవుడ్ స్టార్ రేయాన్ రోల్డ్స్, హ్యూ జాక్ మాన్ లు హీరోలుగా మార్వెల్ స్టూడియోస్ నుంచి సాలిడ్ హైప్ నడుమ వచ్చిన చిత్రం “డెడ్ పూల్ అండ్ వుల్వరీన్” కూడా ఒకటి. మరి భారీ హైప్ నడుమ వచ్చిన ఈ ఆర్ రేటెడ్ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకొని మార్వెల్స్ లో మరో బిగ్ హిట్ గా నిలిచింది.

మరి లోగాన్ ఫ్యాన్స్ కి ట్రిబ్యూట్ గా వచ్చి అలరించిన ఈ చిత్రం ఇపుడు ఫైనల్ గా ఓటిటి ఎంట్రీకి సిద్ధం అయ్యినట్టు బజ్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్ర మొదటిగా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియోలో రాబోతుందట. ఈ అక్టోబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో వీడియో ఆన్ డిమాండ్ రూపంలో రానుండగా ఇదే అక్టోబర్ చివరి నుంచి అయితే ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో పాన్ వరల్డ్ భాషల్లో రానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రేజీ సినిమాకి సంబంధించి అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version