ఇంట్రెస్టింగ్.. “వకీల్ సాబ్” రీరిలీజ్ కి నో చెప్తున్న ఫ్యాన్స్!?

ఇంట్రెస్టింగ్.. “వకీల్ సాబ్” రీరిలీజ్ కి నో చెప్తున్న ఫ్యాన్స్!?

Published on Apr 27, 2024 3:13 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలకి తాత్కాలికంగా విరామం ఇచ్చి తన రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో సడెన్ గా పవన్ నటించిన సెన్సేషనల్ కం బ్యాక్ హిట్ చిత్రం “వకీల్ సాబ్” చిత్రాన్ని రీ రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ మే 1న రానున్న ఈ సినిమా విషయంలో మెయిన్ గా పవన్ అభిమానులే అంత ఆసక్తిగా లేనట్టు కనిపిస్తుంది.

ప్రస్తుతం పవన్ పొలిటికల్ పరంగా బిజీగా ఉంటూ తమకి కావాల్సిన కిక్ ఇస్తున్నాడని ఈ మూమెంట్ లో అలానే ఉండాలని ఆశిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. దీనితో ఈ సినిమా రీ రిలీజ్ పట్ల వారు ఏమంత ఆసక్తిగా లేరనే అనిపిస్తుంది. మరి సడెన్ గా అనౌన్స్ చేసిన ఈ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఇది బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కి రీమేక్ గా తెరకెక్కింది. అలాగే అనన్య నాగళ్ళ, నివేత థామస్, అంజలి లు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు